నాగబాబును మర్యాదపూర్వకంగా కలిసిన మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట, జనసేన పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబును మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు, రాజంపేట జనసేన అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ తెలిపారు. రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నట్లు, ఆయన వివరించారన్నారు. రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించినట్లు వివరించారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు దగ్గర పార్టీ పెద్దల దగ్గర మంచి మంచి గౌరవము, గుర్తింపు ఉందని నాగబాబు తెలియజేశారు. అదేవిధంగా రాజంపేటలో జనసేన పార్టీ జరుగుతున్న పరిస్థితులను సవివివరంగా నాగబాబుకి వివరించారు అన్ని విషయాలను కూలంకూషంగా అధ్యక్షులు వారికి తెలియజేస్తామన్నారు.