డిజిటల్ క్యాంపెయిన్ లో గుంటూరు 16వ వార్డు జనసైనికులు

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్ కి వెళ్ళినటువంటి మన ఆంధ్ర నాయకులకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భావాలను తెలియజేయడానికి మనరాష్ట్ర ఖనిజ సంపదలో ఒకటైన అటువంటి మన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవడం వారి బాధ్యతగా గుర్తు చేస్తూ ఈ డిజిటలైజేషన్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు RAISE_PLACARDS_YSRCP_MP అనే హాష్ టాగ్ తో వారికి తెలియ పరుస్తూ జరగబోయే పార్లమెంట్ సభలో ప్రైవేటీకరణ ఖండిస్తూ ప్లకార్డులు తెలియపరచాలని జనసేన పార్టీ 16వ వార్డు( ఏటుకూరు, బుడంపాడు, బొంతపాడు) తరఫున పార్లమెంట్ సభ్యులకు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో గుంటూరు 16వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి దాసరి లక్ష్మిదుర్గ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య, ఆకుల వీరరాఘవయ్య, నారిశెట్టి కృష్ణయ్య, పావులూరి కోటేశ్వరరావు, దాది ఆంజనేయులు, ఆకుల శివాజీ, మల్లి, సైదులు, సాంబయ్య, సాయి, చంద్రశేఖర్, ఉదయ చంద్రరావు, వీరమహిళలు దేవరకొండ శివ అలాగే బుడంపాడు నుండి శబరిమల యాత్రకు వెళుతూ మద్దతు తెలిపిన జనసైనికులు అయ్యప్ప స్వాములు మరియు కార్యకర్తలు, జనసైనికులు అందరూ మద్దతు తెలుపుతూ ఫ్లకార్డు రూపంలో AP MPలను ట్విట్టర్ లో టాగ్ చేస్తూ మద్దతు తెలియజేయడం జరిగింది.