జ్యోతిరావు పూలేకు నివాళులర్పించిన పిడుగురాళ్ల జనసేన

గురజాల, మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా పిడుగురాళ్ల మండల జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ దళిత అభ్యున్నతి, మహిళా సాధికారత సాధించేందుకు సామాజిక అసమానతలు రూపొందించేందుకు తన జీవితాంతం పోరాటం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు. అనంతరం జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, జీవితాంతం పోరాటం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప వ్యక్తిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, పిడుగురాళ్ల మండల ఉపాధ్యక్షులు బయ్యవరపు రమేష్, బేతంచర్ల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి గుర్రం కోటేశ్వరరావు, షేక్ మదీనా, జానపాడు గ్రామ అధ్యక్షులు పసుపులేటి నరసింహారావు, మండల కార్యదర్శి బేతంచెర్ల నాగేశ్వరరావు, దీకొండ కిరణ్, కంభంపాటి ముక్కంటి, జనసేన నాయకులు పెడకోలిమి కిరణ్ కుమార్, తోట రామదాసు, సింగంశెట్టి పూర్ణచంద్రరావు, నాగు, మొదలగు వారు పాల్గొన్నారు.