శ్రీకృష్ణదేవరాయలకు రాజంపేట జనసేన ఘన నివాళులు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయల జయంతిని పురస్కరించుకొని రాజంపేట పట్టణంలో పాత బస్టాండ్ సర్కిల్లో ఉన్న కృష్ణదేవరాయలు విగ్రహంకు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు సూచన మేరకు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు పూలమాలలు వేసి ఘన నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తి నారాయణ, తోట సురేష్, అబ్బిగారి గోపాల్, అల్లం చంద్రశేఖర్, చిట్టే భాస్కర్, నాసర్ ఖాన్, రాజేష్ వర్మ, నారదాసు రామచంద్ర, రాజా ఆచారి, మౌలా, శివశంకర్ రాజు, క్రిష్ణయ్య, సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.