విద్యుత్ సంక్షోభానికి వైసిపి అనాలోచిత విధానాలే కారణం: గుంతకల్ జనసేన

గుంతకల్ పట్టణం, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మరియు అనంత జనసేనాని టిసి వరుణ్ సూచనలతో, జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ సహకారంతో పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం అజంతా సర్కిల్, పొట్టిశ్రీరాములు విగ్రహం దగ్గర కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పేద మధ్యతరగతి వారిని నడ్డివిరిచే విధంగా విద్యుత్ చార్జీలను ఇష్టానుసారంగా పెంచడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం అల్పాదాయ వర్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చిన వైసిపి నాయకత్వం ఇవాళ 57 శాతం చార్జీలు పెంచింది, ఫ్యాన్లు రెండు లైట్లు 15 గంటలు టీవీ చూసిన 150 యూనిట్లు ఖర్చవుతుందని, మరో 50 యూనిట్లు పెద్దమనసుతో అదనంగా ఇస్తామని ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ఇళ్ళల్లో ఫ్యాన్ వేసుకోకుండా చేశారు, వైసీపీ ప్రభుత్వ అనాలోచిత విధానాలే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి జీవన్, గుంతకల్ మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, జనసేన పార్టీ సీనియర్ నాయకులు 13 వార్డు ఇంచార్జి బండి శేఖర్, ఎర్రి స్వామి, సుబ్బయ్య, పాండు కుమార్ మరియు జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు పవర్ శేఖర్, ఎస్ కృష్ణ, సోహెల్ నిస్వార్థ జనసైనికులు వీరేష్, పామయ్య, రమేష్ రాజ్, దాదు, శ్రీనివాసులు, రామకృష్ణ, అల్లు రవి, రవితేజ, ఐఓసీ శేఖర్, అమర్, మంజు, మౌల, సత్తి, అనిల్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.