రాజంపేట ఎంపీ, కోడూరు, రాజంపేట ఎమ్మెల్యేలు నమ్మక ద్రోహులు: తాతంశెట్టి నాగేంద్ర

రైల్వే కోడూరు: జిల్లాల విభజనలో బ్రిటీషు కాలం నుండి ఎంతో ప్రాశస్త్యం కలిగి అన్నివసతులు ఉన్న కూత వేటు దూరంలో అన్నమయ్య స్వస్థలం ఉన్న రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా హెడ్ క్వార్టర్ చేయడం వెనుక ఎంపీ మిథున్ రెడ్డి గారి ఏకపక్ష నిర్ణయం. అందరి ఆమోదంతో నిర్ణయం ఉంటుందని చెప్పిన కోడూరు, రాజంపేట ఎమ్మెల్యేలు స్థానిక ప్రజలను నమ్మించి మోసం చేశారని.. ఒక్కొక్క కార్యాలయం తరలి వెళుతుంటే చోద్యం చూస్తున్నారని ప్రజలు ఈ ఇద్దరి ఎమ్మెల్యేలకు, ఎంపీకి తగిన గుణపాఠం చెప్పాలని జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొన్న సేల్ టాక్స్, కార్యాలయము, నేడో, రేపో, ఫారెస్ట్ కార్యాలయం కూడా వెళ్ళిపోతుందని, ఎమ్మెల్యేలు వారి రాజకీయ స్వార్థం కోసం చోద్యం చూస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఎంపీ మిథున్ రెడ్డిగారు వేదిక మీద కనీసం కోడూరు, రాజంపేట పేర్లను పలకడానికి కూడా ఇష్టపడలేదన్నారు.. కోడూరు నియోజకవర్గంలోని మంగపేట మైన్స్ ఆదాయానికి, ఉద్యోగాలకు కావాలి కానీ నియోజకవర్గం ఎంపీ గారికీ అవసరం లేదన్నారు… రాయచోటి ప్రజలకు మేము వ్యతిరేకంకాదు, కాని మౌలికవసతులు కూడా లేని రాయచోటిని శ్రీకాంత్ రెడ్డి సాధిస్తే, మేడ మల్లికార్జున రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు చేతగాని వాళ్ళలా చరిత్రలో నిలిచి పోయారన్నారు.. ఎంపీ తన రాజకీయ ఎత్తుగడలకు రాజంపేట, రైల్వేకోడూరు నియోజక వర్గాలను ఇనుప పాదాల కింద నొక్కిపెట్టి వీటికి ప్రాశస్త్యం లేకుండా చేశారని ఇవన్నీ ప్రజలు గుర్తిస్తున్నారు.. తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.. మీరు ఇప్పటికైన రాజంపేట హెడ్ క్వార్టర్ గా జిల్లా ప్రకటించాలని, లేదంటే రాజంపేట కడపజిల్లా లోను, కొడురును తిరుపతి జిల్లాలోను కలపాలని కోరుతూ.. త్వరలో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తామని తెలియ పరిచారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారుమంచి సంయుక్త, పగడాల వెంకటేశ్, వరికూటి నాగరాజు, అంకిశెట్టి మణి, దాసరి వీరేంద్ర, మల్లెల శివ తదితరులు పాల్గోన్నారు.