క్రియాశీలక సభ్యత్వాల నమోదు రాష్ట్రంలో మొదటి స్థానంలో రాజానగరం

  • రాష్ట్రంలోనే అత్యధిక జనసేన క్రియాశీలక సభ్యత్వాలు నమోదు
  • రాజానగరం నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలపడంలో కృషిచేసిన బత్తుల బలరామకృష్ణ
  • బత్తుల బలరామకృష్ణని సన్మానించిన జనసేన పార్టీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్

రాజానగరం, రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గంలో బుర్రిలంక గ్రామంలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సర్వసభ్య సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో ఎక్కువ క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేసిన క్రియా వాలంటీర్ శ్రీమతి బత్తుల ప్రత్యూష దేవి 2500+ తరపున ఆమె తండ్రి బత్తుల బలరామకృష్ణని ఘనంగా సత్కరించారు. అలానే రాష్ట్రంలో మరొక ఎక్కువ సభ్యత్వాలు నమోదు రాజానగరం నియోజకవర్గం, తోకాడ గ్రామం నుండి 1818 సభ్యత్వాలు నమోదు చేసిన క్రియా వాలంటీర్ నల్లమిల్లి మణికంఠ తరుపున ఆ గ్రామానికి చెందిన వేగిశెట్టి రాజుని కూడా ఈ సందర్భంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు కందుల దుర్గేష్, ఇతర పార్టీ పెద్దలు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.