69 సంవత్సరాల వృద్ధురాలికి పెన్షన్ అందించిన జనసేన నాయకులు

  • 69 సంవత్సరాలు నిండిన వృద్ధురాలికి పెన్షన్ ఇవ్వని అధికారులు

కర్నూల్ జిల్లా, పాణ్యం నియోజకవర్గం, గణేష్ నగర్ 19 వార్డులో పూలే అంబేద్కర్ కాలనీలో నివసించే పొన్నగంటి సువర్ణమ్మ పుట్టిన తేదీ 01.01.1953 అంటే దాదాపు 69 సంవత్సరాలు. ప్రభుత్వం నుంది పెన్షన్ రాని కారణంగా 5 నెలలు గా జనసేన పార్టీ ఈమెకి పెన్షన్ ఇస్తుంది. గత మూడు సంవత్సరాల నుంచి వైస్సార్ పెన్షన్ కొరకు ఎమ్మెల్యే గారికి విన్నవించారు.. మేయర్ బి.వై. రామయ్య గారికీ విన్నవించారు.. ఎవ్వరూ ఈమెకి పటించుఒవడం లేని సమయంలో ఈమె 19వ వార్డు బాలు గారికి సువర్నమ్మ సమస్య విన్నవించగా.. పాణ్యం నియోజకవర్గం ఇన్చార్జి సురేష్ బాబు దృష్టికి తిసుకోపోగా ఆయన వెంటనే స్పందించి నెల నెల 2501/- ప్రతి నెల 1వ తేదీ సువర్ణమ్మ కు గత 5 నెలలుగా ఇస్తున్నారు ఈ నెల చింత సురేష్ బాబు సూచనల మేరకు రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ కొ-ఆర్డినేటర్ శ్రీమతి.యస్.ఎం.డి.హసీనా బేగం రూ.2501/- సువర్ణమ్మ కు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వచ్చే నెల నుంచి ప్రభుత్యం కచ్చితంగా సువర్ణమ్మకు పెన్షన్ ఇచ్చే దిశగా అధికారుల దృష్టికి తీసుకొని పోయి కచ్చితం గా సువర్ణమ్మ కు న్యాయం చేకూరే దిశగా పోరాడుతాం అని జనసేన పార్టీ రాయలసీమ వీర మహిళ ప్రాంతీయ కమిటీ కో – ఆర్డినేటర్ శ్రీమతి.యస్.ఎం.డి.హసీనా బేగం హామీ అందించారు.