జెనసేన జెండాతో శబరిమల యాత్ర చేసిన రాజోలు జనసైనికుడు

రాజోలు నియోజకవర్గం, మామిడికుదురు మండల జనసైనికుడు మెండా వెంకట్రావు తన శబరిమల యాత్రలో భాగంగా అన్ని పుణ్య క్షేత్రాలకు జనసేన జండాను తీసుకుని వెళ్లి పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అదియోగి, పళణి, మదురై, కాణిపాకం, విజయవాడ, రామేశ్వరం, కన్యాకుమారి ఇలా అన్ని క్షేత్రాలలో పూజలు నిర్వహించడం జరిగింది. శబరిమల నడక మార్గంలో జనసేన జెండాతో ప్రయాణం చేస్తుంటే చాలా మంది భక్తులు ఆ జెండాను చూసి అనందం వ్యక్తం చేశారు. అయ్యప్పస్వామి వారి సన్నిధిలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. స్వామి వారి చెంతకు ఇలా జెండాను తీసుకుని రావడం చాలా అనందం అని జనసైనికుడు వెంకట్రావు తెలియజేసారు. వీరితో పాటు మామిడికుదురు జనసైనికులు రాంబాబు, శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు, సాయి, ఫణి, ప్రసాద్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు.