ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా “జాలి లేని రాక్షసివే” సినిమా ప్రదర్శన

హైదరాబాద్, పాల్వంచకు చెందిన ఆర్.ఆర్ రాఫక్ సాయి కీర్తీ సింగ్, ఢీ 10 టైటిల్ విన్నర్ సాకేత్ రాజు, శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఇంకా ఆవేశం స్టార్ నరేష్, తేజ డాన్సర్, చరణ్యశ్రీ, రాకీ, చిరంజీవి, ఆంజనేయులు, కరుణాకర్, జునైద్ జును, శ్రీను, నరేంద్ర మౌనిక, ఫణి, కోటి కంట్రోల్ మేనేజర్ కావ్యశ్రీ, చింతమళ్ళ నాగరాజు, ఛాయాగ్రహఒ ఉదయ్ కుమార్ జి, సంగీతం దర్శకుడు గోపీనాధ్ కొండ, కో-డైరెక్టర్ కలిదిండి నాని, దర్శకత్వం వినుకొండ రంజిత్ రాజు వహించిన చిత్రం జాలిలేని రాక్షసివే సినిమా ప్రదర్శన ఆదివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో ప్రదర్శించారు. వీక్షకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేశారు. త్వరలో అధికారికంగా చిత్ర యూనిట్ జాలిలేని రక్షసివే సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తామని తెలిపారు.