గుంతకల్ పట్టణంలో ఘనంగా రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలు

  • రక్తదాన శిభిరానికి అనూహ్య స్పందన

అనంతపురం జిల్లా, గుంతకల్ పట్టణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా గోపి బ్లడ్ బ్యాంకులో ఘనంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగినది. అఖిల భారత చిరంజీవి యువత, రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సుమారు 50 మంది దాకా రక్తదానం చేసినట్టు అభిమాన సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర కార్యదర్శి బి గోపి, చిరంజీవి యువత నియోజకవర్గ అధ్యక్షులు పాండు కుమార్, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు బండి శేఖర్, సాయి ధరంతేజ్ రాష్ట్ర అధ్యక్షులు పవర్ శేఖర్, డిస్ లోకేష్, ఎస్ కృష్ణ, ఎం వెంకటేష్, పామయ్య, హరి, శివ, కాంత, రమణ, రాము, శశి, రమేష్, ప్రసాద్, శీన, అశోక్, పాపులర్ షూ పాండు, శివ, రాజు, వీరేష్, వంశి, సూరి, అనిల్, సునీల్, పవన్ తదితరులు పాల్గొన్నారు.