నందికొట్కూరు జనసేన కార్యాలయంలో రామ్ చరణ్ జన్మదిన వేడుకలు

నందికొట్కూరు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ నందికొట్కూరు నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్లమల్ల రవికుమార్, బోరెల్లి వెంకటేష్, కాకర్ల కిరణ్, మద్దిలేటి, పగడం శేషన్న తదితరులు పాల్గొన్నారు.