వేమూరు జనసేన ఆధ్వర్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు

వేమూరు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు చావలి ఎంపీటీసీ గాజుల నగేష్ ఆధ్వర్యంలో వేమూరులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ, కొల్లూరు జనసేన నాయకులు వెలివల భాస్కర్, సమ్మెట దుర్గాప్రసాద్, ఉప్పు భాస్కర్, ఈమని సాయి, చందన శ్రీను, మేకల బాలాజీ, చుండూరు మండల ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, వేమూరు నాయకులు సోమరౌతు బ్రహ్మం, వెలివల శివ మరియు జనసైనికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.