గంగమ్మ జాతర మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్యజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని వీరబల్లి మండల పరిధిలో శ్రీశ్రీశ్రీ సానిపాయి గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా.. జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్, జనసైనికులు స్థానిక గ్రామస్థులతో కలిసి శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మ వారి ఆశీస్సులు భక్తులు అందరికీ ఇవ్వాలని అదేవిధంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరిగింది. అలానే సోమవారం రాత్రి భక్తాదులు మరియు మొక్కులు చెల్లించుకునేందు వైష్ణవి విద్యాసంస్థలు అధినేత పగడాల రవీంద్ర, సానిపాయి గ్రామపంచాయితీలో అన్ని గ్రామాల ప్రజలు సాంస్కృతి సంప్రదాయం ప్రకారం చాందని బండ్లు, వివిధ రకాల కళారంగం వారితో డప్పు వాయిద్యాలు చక్కబజనాలు, డిజెలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుంచి సానిపాయి గ్రామపంచాయితికి సంబంధించి బంధువులు, స్నేహితులు, వివిధ మాధ్యమాల వారు భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ భారీ ఎత్తున హాజరయ్యారు.