ప్రజా సమస్యలపై కలెక్టర్ కు రామ శ్రీనివాస్ వినతి

రాయచోటి: జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ గురువారం జనసైనికులతో కలసి అన్నమయ్య జిల్లా గౌరవ కలెక్టర్ పి యస్ గిరీష ను కలసి ప్రజా సమస్యల గురించి విన్నవించారు. అందులో భాగంగా రాయచోటి నుండి సుండుపల్లి వరకు జరుగుతున్న -రెండు వరుసల రోడ్డు మార్గమును పూర్తి చేసి అలానే సుండుపల్లి మీదుగా రాయవరం మీదుగా పింఛాకు వెళ్లే ఇరుకురోడ్డు వలన తరచు ప్రమాదాలకు గురవుతున్నారని ఆ రోడ్డు విస్తరణకు నిధులు మంజూరు చేసి మరమ్మత్తులు చేప్పాట్టాలని అలానే రాయచోటి నుంచి రాజంపేట వెళ్ళే రోడ్డు లో కొత్తరోడ్డు, చెక్ పోస్ట్ కు సమీపంలో ఉన్న ఇరుకైన రోడ్డు వంతెన, అక్కడే మలుపును తక్షణమే గుర్తించి వాహనాలు నిరంతరం రద్దీగా తిరుగుతుంటాయి. అక్కడ ప్రమాదాలు జరగకుండా చూసేందుకు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని. అలాగే వీరబల్లి లో ఉండే మాండవ్య నది వద్ద ఎత్తయినా వంతెన నిర్మాణ పనులు తక్షణమే చేప్పాట్టాలని అలాగే రాయచోటి నుంచి వీరబల్లి, గడికోట తదితర ప్రాంతాలకు విద్యార్థులు అక్కడ ప్రాంతాలలో ప్రజా అవసరాలకు అనువుగా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సు సర్వీస్లు ఉండాలని, అదేవిదంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో వంతెనలు వద్ద రోడ్లపై గుంతలు పడి వాహనాలు దెబ్బతిని వాహన చోదకులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి గ్రామీణ ప్రాంతాలలో ఉండే రోడ్లు మరియు ఆర్టీసీ బస్సుల యొక్క సర్వీసులు పట్ల విద్యార్థులు నిత్యం ప్రయాణించే ప్రయాణీకులు మారుమూల ప్రాంతాలవారు నిరంతరం పడుతున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ గారికి తెలియజేయడం జరిగింది. ఆయన ఈ విషయంపై కలెక్టర్ పి యస్ గిరీష సానుకూలంగా స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామ శ్రీనివాస్, జనసైనికులు సుంకర మదన్ కుమార్, లోకేష్, శివ కుమార్, రామకృష్ణ, రెడ్డికుమార్, దినేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.