శ్రీశ్రీశ్రీ నాగారపమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న రామ శ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి. సుండుపల్లి మండల పరిధిలో ముడుంపాడు గ్రామపంచాయితీ కందలవాండ్లపల్లిలో సోమవారం శ్రీశ్రీశ్రీ నాగారపమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆలయ నిర్మాత కంచన రెడ్డయ్య దంపతులు శ్రీమతి సుగుణమ్మతో కలిసి వారి కుటుంబ సభ్యులు రామ శ్రీనివాస్ కు ఘనస్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామ శ్రీనివాస్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మదన్ కుమార్, ఎల్లయ్య, లోకేష్, శేషాద్రి, జనసైనికులు, స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.