ముస్లిం జర్నలిస్టులకు రంజాన్ తోఫా

  • జనసేన జిల్లా ఉపాధ్యక్షులు బులియశెట్టి శ్రీకాంత్

పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ ముస్లిం జర్నలిస్టులకు రంజాన్ తోఫా’ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో 30 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తూ కూడా, ఎండలో ప్రజా సమస్యల కోసం ప్రయత్నం చేస్తున్నారు. ముస్లిం జర్నలిస్టులు కూడా పండుగను ఆనందంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో తమ వంతు సహాయంగా.. రంజాన్ తోఫా’ను ఆనవాయితీగా అందజేస్తున్నామని వెల్లడించారు. ముస్లిం జర్నలిస్టులను అడ్వాన్సుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొలియశెట్టి శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.