సువర్ణరాజు ఆధ్వర్యంలో 100 ముస్లిం మహిళా కుటుంబాలకు రంజాన్ తోఫా

గోపాలపురం నియోజకవర్గం, దేవరపల్లి మండలం, లక్ష్మీపురం గ్రామంలో గురువారం జనసేన పార్టీ తరఫున జనసేన రంజాన్ తోఫా కార్యక్రమాన్ని నియోజకవర్గ నాయకులు దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముందు గ్రామంలో పాఠశాల సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం కార్యక్రమం వద్దకు చేరుకుని, రంజాన్ తోఫాను గ్రామంలో ఉన్న 100 ముస్లిం మహిళా కుటుంబాలకు మసీద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టేజ్ వద్ద అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవరపల్లి మండల అధ్యక్షులు కాట్నం గణేష్, దుద్దుకూరు గ్రామ నాయకులు గౌస్, మాలే సతీష్, ఖాజా, గ్రామ నాయకులు పాకా మురారి, గౌతమ్ రాజు, సతీష్, మీరా, పోలుమాటి నాని, వార్డ్ మెంబర్ పెద్ద కమల్, జనసైనికులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.