సుంకర కుటుంబానికి చేయూతనిచ్చిన పలచోళ్ళ వేణు

అమలాపురం, పురపాలక 9వ వార్డ్, సుంకర నాగేశ్వరావు కిడ్ని వ్యాధితో బాధపడుతున్నారని తెలిసిన జనసేన పార్టీ ఐటీ కో-ఆర్డినేటర్ మరియు శతఘ్ని న్యూస్ డైరెక్టర్ పలచోళ్ల వేణు రూ.5000/- ఆర్థికసాయం అందించడం జరిగింది. 9వ వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకొటి విజయలక్ష్మి-వాసు దంపతుల చేతుల మీదుగా సుంకర కుటుంబానికి వేణు అందించారు.