మత్స్యకార సమస్యలపై గళమెత్తిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ వేట నిషేధ భృతి తక్కువ కావడం వల్ల మత్స్యకారులు పడుతున్న ఇబ్బందుల గురించి, ఆయిల్ సబ్సిడీ 300 లీటర్ల చాలా తక్కువ అని దీని వల్ల పడుతున్న ఇబ్బందుల రీత్యా మరియు రక్షణ వాలు నిర్మించాలి మత్స్కర గ్రామాలను కాపాడాలి అనే నినాదాలతో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మత్స్యకార నాయకులతో కలిసి వారి సమస్యలపై నిరసన తెలపడం జరిగింది. అనంతరం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ మత్స్యకారులు వేట నిషేధం కారణంగా రెండు నెలలు సంపాదనలేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వారు ఇచ్చే వేట నిషేధ భృతి ఒక కుటుంబానికి రెండు నెలలకి కలిపి 10,000/- రూపాయలు ఇస్తున్నారు అంటే రోజుకి 160 రూపాయలు. ఒక మత్స్యకార సోదరుడు వేటకి వెళ్తే అతని కుటుంబంలో నలుగురైదుగురు తన మీదనే ఆధారపడి ఉంటారు ఇప్పుడు మనం చూస్తుంటే నిత్యవసర వస్తువులు ఆకాశానికి అందుకుంటున్నాయి. ఈ 10,000/- రూపాయలు ఏ మాత్రం సరిపోవని చాలా తక్కువ కాబట్టి 10,000/- నుండి 30,000/- కి పెంచాలని అదేవిధంగా ఆయిల్ సబ్సిడీ 300 లీటర్లు ఇస్తున్నారు ఇది రెండు మూడు సార్లు వేటకి వెళ్లి వచ్చేసరికి అయిపోతుంది మళ్లీ మత్స్యకార సోదరుడు తన జేబులోంచి తీసుకొచ్చి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి పక్కన ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటే 3000 లీటర్ల వరకు ఇస్తున్నారని అదేవిధంగా ఈ ఉప్పాడ మూలపేట కోనపాప పేట గ్రామాల్లో కూడా 300 నుంచి 3000 లీటర్ల వరకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తా ఉంటే సముద్రానికి ఆనుకుని ఉన్న ఇళ్ళు కొట్టుకుని పోయే పరిస్థితిలో ఉందని తక్షణమే రక్షణ గోడ నిర్మించాలని లేకుంటే కొద్దిరోజులకి ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పాడ కోనపాప పేట మూలపేట మొదలగు గ్రామాలు కొట్టుకొని పోయే పరిస్థితి ఉందని ఫ్యూచర్లో మనం ఈ గ్రామాల గురించి మాట్లాడుకోవడం తప్ప చూడడానికి కూడా కనిపించే అవకాశం ఉండదని తక్షణమే ప్రభుత్వం వారు చర్య తీసుకుని రక్షణ గోడ నిర్మించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియా ముందు వాపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా మత్స్యకార నాయకులు వంక కొండబాబు, మత్స్యకార నాయకులు పల్లేటి బాపన్నదొర, రాంశెట్టి రాంబాబు, మైలపల్లి రాజు, బొంతల వెంకటరావు, పల్లెటి జాన్సన్, బడే అడవి రాజు, బడే మాసేను, చింతకాయల పూరి జగన్నాథం, తిత్తి హరి, బడే తాతారావు, మెరుగు ఆనంద్, మెరుగు నాగేష్, మెరుగు సతీష్, మచ్చ లక్ష్మణరావు, పుక్కల కుమార్, నియోజకవర్గ నాయకులు ఎక్స్ సర్పంచ్ గరగా సత్యానందం, ఎక్స్ విద్య కమిటీ చైర్మన్ దుడ్డు రాంబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, బొజ్జ గోపికృష్ణ, మచ్చ శ్రీనివాస్ బండి వాసు బాబు, మచ్చ రాజుబాబు, పల్నాటి మధుబాబు, వీరారెడ్డి అమర్, కురాడ సత్తిబాబు, కీర్తి చంటి, గుర్రం గంగాధర్ మరియు అధిక సంఖ్యలో మత్సకారులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.