వివిధ హోదాల్లో ఉన్న బీజేపీ నాయకులను కలిసిన రామకృష్ణ మిరియాల

తెలంగాణ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ అభ్యర్థి రామకృష్ణ మిరియాల ఆదివారం ఖమ్మం నియోజకవర్గ బీజేపీ పార్టీకి సంబంధించి వివిధ హోదాల్లో ఉన్న నాయకులను కలవడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రామకృష్ణ మిరియాల అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

జనసేన-బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం

తెలంగాణ, జనసేన-బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం ఖమ్మం నియోజకవర్గంలో శుకరవారం సాయంత్రం నిర్వహించడం జరిగింది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి ఎలా ముందుకు వెళ్లాలో చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బలపరిచిన జనసేన అభ్యర్థి రామకృష్ణ మిరియాల, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు దుంపటి శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.