ఖమ్మం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన రామకృష్ణ మిరియాల

ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాల, పాత బస్టాండ్ రిక్కా బజార్ హైస్కూల్, కత్తుల వీరమ్మ మెమోరియల్ ట్రస్ట్ (కే.వి. ఎం హైస్కూల్ జడ్పీసర్కిల్ ఖమ్మం) పాఠశాలాల్లో మౌలిక వసతులను ముఖ్యంగా మరుగుదొడ్ల సమస్య గురించి తెలుసుకోవడానికి ఖమ్మం జనసేన అసెంబ్లీ కోఆర్డినేటర్ రామకృష్ణ మిరియాల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఒక్క పాఠశాలలో కూడా మరుగుదొడ్లు సరిగ్గా లేని పరిస్థితి, పరిశుభ్రంగా లేక కంపు కొడుతున్న పరిస్థితులు, 300 బాలికలకు మూడు మాత్రమే మరుగుదొడ్లు ఉన్న పరిస్థితి వాటికి కూడా డోర్లు సరిగ్గా లేని పరిస్థితి, ఒక స్కూల్లో అయితే బాలురు పబ్లిక్ టాయిలెట్ ని వాడుకోవాల్సిన పరిస్థితి, స్కూళ్లలో మరుగుదొడ్లు కూడా లేని పరిస్థితిని ఏ విధమైన అభివృద్ది అంటారో ఒక సారి ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించుకోవాలి. మిగతా స్కూల్స్ ని కూడా సందర్శించిన తరువాత దీని మీద జనసేన పార్టీ తరుపున కలెక్టర్ కి ఒక నివేదికను అందజేస్తాం. వారు తగు చర్యలు తీసుకోని పక్షంలో జనసేన పార్టీ తరఫున ఈ సమస్య మీద పోరాటాన్ని ఉదృతం చేస్తాం అని ఆయన తెలిపారు.