శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొన్న రామశ్రీనివాస్

అన్నమయ్య జిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో పీలేరు మరియు పెద్దబలిజపల్లి వెళ్ళే రోడ్లకు సమీప దూరంలో ఉన్న అగ్రహారం నందు గ్రామ ప్రజలు అందరూ కలిసి నూతనంగా నిర్మించిన శ్రీరాములు వారి గుడిలో సీతారామ, లక్ష్మణ, అంజనేయ మరియు వినాయక స్వాముల వారి విగ్రహాలు ప్రతిష్టా, కళ్యాణము, అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆహ్వానం మేరకు గ్రామపెద్దలు, అక్కడి స్థానిక గ్రామస్థులు, వివిధ ప్రాంతాల నుంచి ముఖ్య అతిధులు, ప్రజలందరితో కలిసి జనసేన నాయకులు రామ శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది.