కృష్ణలంక పీఎస్ లో పవన్ పై కేసు నమోదును ఖండిస్తున్నాం

  • అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తామంటే బెదరడానికి పవన్ కళ్యాణ్ గానీ, జనసేన నాయకులు గానీ, కార్యకర్తలు గానీ భయపడే ప్రసక్తే లేదు
  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

అనంతపురం: కృష్ణలంక పీఎస్ లో పవన్ పై కేసు నమోదును అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఖండించారు. అనంతపురం జనసేన కార్యాలయంలో గురువారం విలేకరులతో జయరాం రెడ్డి మాట్లాడుతూ.. వారాహి యాత్రలో వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై విజయవాడ కృష్ణలంక పోలీసులు తప్పుడు క్రిమినల్ కేసు నమోదు చేసారు. సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్ కు చెందిన దిగమంటి సురేష్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ క్రిమినల్ కేసు నమోదు చేసారు. జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై 153, 153ఆ, 505(2) ఈఫ్ఛ్ సెక్షన్ల కింద కేసు నమోదు కృష్ణలంక పోలీసులు తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమ కేసుల్లో తనపైన ఎఫ్ఐఆర్ నమోదయ్యాయని మిగతా నాయకులు అందరి పైన కూడా ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తప్పుడు కేసులు కట్టాలనే దురుద్దేశంతో తప్పుడు ఆలోచన విధానాలతో అక్రమ కేసులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై నమోదు చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది వాలంటరీలు అమ్మాయిల్ని వేధించింది వాస్తవం కాదా..? గంజాయి ఎర్రచందనం మద్యం లాంటి అనేక నేరాల్లో ఉన్నారా లేదా?, కొంతమంది వాలంటరీలు అమ్మాయిల్ని మభ్యపెట్టి మాయం చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నది వాస్తవం కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే చాతనైతే వీటికి సమాధానం చెప్పు. నువ్వేదో అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తామంటే బెదరడానికి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గానీ, జనసేన నాయకులు గాని, కార్యకర్తలు గాని భయపడే ప్రసక్తి లేదని నీకు హెచ్చరిక జారీ చేస్తున్నామని జయరాం రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి, భవాని రవికుమార్, హిమామ్ హుస్సేన్, అల్తాఫ్, ఆటో ప్రసాద్, దేవర అంజి, జాఫర్ సాదిక్ తదితరులు పాల్గొన్నారు.