సింగరాయకొండ గ్రామ సమస్యలపై జనసేన వినతిపత్రం

  • సింగరాయకొండ గ్రామ సర్పంచ్ పై అసహ్యించుకుంటున్న సింగరాయకొండ గ్రామ ప్రజలు
  • నాడు ప్రజలతో ప్రజల పక్షాన నేను ఉంటాను అని చెప్పి ప్రజల చేత ఓట్లు వేపించుకొని గెలిచి, నేడు ప్రజలకి కనిపించని సింగరాయకొండ గ్రామ సర్పంచ్ తాటీపర్తి వనజ
  • మురికి కూపంలో మగ్గుతున్న ఇస్లాంపేట నాలుగో లైను గ్రామ ప్రజలు
  • సింగరాయకొండ గ్రామపంచాయతీలో కనిపించని పారిశుధ్యం
  • డ్రైనేజీలో పేరుకుపోయిన మురుగు సైరవిహారం చేస్తున్న డెంగ్యూ దోమలు, అనారోగ్యాల పాలనైన ఇస్లాంపేట నాలుగవ లైను ప్రజలు
  • ఇస్లాంపేట నాలుగో లైన్లు పలుమార్లు సందర్శించిన సింగరాయకొండ గ్రామ పంచాయతీ సర్పంచి తాటీపర్తి వనజ
  • కేవలం మాటల గారడి లే తప్ప అభివృద్ధి శూన్యం, ప్రజల ప్రాణాలతో చెలగాటం, ప్రజాధనం ఎటువైపు వెళుతుంది అంటున్న సింగరాయకొండ గ్రామ ప్రజలు

కొండెపి: వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డ నాటీ నుండి ఆర్భాటాలకే పరిమితం తప్ప, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని చెబుతున్న సింగరాయకొండ గ్రామ ప్రజలు. సింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని ఇస్లాంపేట నాలుగో లైను ప్రజలు తీవ్ర దుర్గంధం మధ్య విలవిలాడుతున్నారు. సింగరాయకొండ గ్రామపంచాయతీ సర్పంచ్ తాటీపర్తి వనజ గారు పలుమార్లు ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి డ్రైనేజీ సమస్యను మరియు కరెంటు స్తంభాన్ని వేయించి ప్రజల సమస్యలు వెంటనే చేస్తాను అని హామీ ఇచ్చి సుమారు రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ గాలి మేడలు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆ ప్రాంత ప్రజలు జనసేన దృష్టికి సమస్యలను తీసుకురావడం జరిగింది. జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ ఆధ్వర్యంలో పరిశీలించిన మీదట ఆ ప్రాంత ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆశ్చర్యానికి గురికాక చుట్టూ ముళ్లపదులు, పాములు, మంచినీరు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది కరంగా ఏర్పడి ఉన్నది. నాడు బాలాజీ నగర్ నుండి సాయిబాబా గుడి వరకు నిర్మించిన పెద్ద డ్రైనేజీ కాలువకు వీధి చిన్న డ్రైనేజీ పెద్ద కాలువకు మురికిని కలపకుండా నాడు అధికారులు నిద్రమత్తులో ఉన్న అందువలన అధికారుల నిర్లక్ష్యానికి నేడు ఆ ప్రాంత ప్రజలు శాపంగా మారి మురికి నీరు ఎటు పోకుండా నిల్వ ఉన్నందువల్ల ఆ ప్రాంత ప్రజలు డెంగు బారిన పడటం జరుగుతున్నది. కనుక యుద్ధ ప్రాతిపదికన ఇస్లాంపేట నాలుగో లైను ప్రజలకు మురికి నీరు పోయే విధంగా వీధి డ్రైనేజీని, పెద్ద డ్రైనేజీకి కలిపి దానిపై రాకపోకలకు నిర్మించి మంచినీళ్లు తెచ్చుకోవడానికి కానీ ప్రజలు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడవలెనని అదే విధంగా చిల్ల చెట్లు తొలగించి పాముల భారీ నుండి కాపాడవలేనను అని ప్రజల తరఫున జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ సమస్యపై సనివారం ఎంపీడీవో మరియు సింగరాయకొండ గ్రామపంచాయతీ సెక్రటరీ గారికి వినతి పత్రం అందజేయుటం జరిగినది. వెంటనే ఆ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించనట్లయితే ఆ ప్రాంత ప్రజలతో జనసేన పార్టీ సింగరాయకొండ గ్రామపంచాయతీ నందు గాని ఎంపీడీవో జమీవుల్ల క్యాంపస్ నందు గాని నిరసన తెలియజేయుటకు వెనకాడబోమని జనసేన పార్టీ నుండి తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల నాయకులు ప్రధాన కార్యదర్శి కాసుల శ్రీనివాస్, ప్రచార కార్యదర్శి తగరం రాజు, కమిటీ సభ్యులు పంకం మధుసూధన్, సాగి అభయ్ సేన మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.