రంపచోడవరంను 27వ జిల్లాగా ప్రకటించాలి

రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరలు, పెట్రోల్, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని మండల ప్రజల తరపున మరియు రంపచోడవరంను 27వ జిల్లాగా ప్రకటించాలని, విలీన మండలాల ప్రజల తరుపున జనసేన మరియు సీపిఐ పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ.. వి ఆర్.పురం మండలం వడ్డిగూడెం పంచాయితీ సెక్రటరీకి మరియు సచివాలయ సిబ్బందికి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ములకాల సాయి కృష్ణ, సీపీఐ మండల సెక్రెటరీ కర్నాటి రాంబాబు, ముంజపు సాయి మరియు ప్రజలు పాల్గొన్నారు.