జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి: జవాజీ రేఖ

• తక్షణమే జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి

• ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అవమానించడం భాదకరం

• జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న వైసీపీ హామీ నిలబెట్టుకోవాలి

• జనసేన పార్టీ ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్, రాష్ట్ర మహిళా చైర్మన్ జవాజీ రేఖ

ముఖ్యమంత్రిని ఆరాధిస్తే తప్పక ఇళ్ల స్థలాలు వస్తాయంటూ సమాచార శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ ఎమ్మిగనూరు అసెంబ్లీ ఇంఛార్జ్, రాష్ట్ర మహిళా చైర్మన్ జవాజీ రేఖ తప్పుపట్టారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాను అమానించడం బాధాకరమంటూ.. బుధవారం జనసేన పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తక్షణమే జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని జావాజీ రేఖ డిమాండ్ చేశారు. పాత్రికేయుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించాల్సిన మంత్రి ఇలా బాధ్యతారాహిత్యంగా మాట్లడడం తగదన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న వైసీపీ ఎన్నికల హామీ నిలబెట్టు కోవాలని గుర్తు చేసారు. ప్రతి జర్నలిస్టుకు హెల్త్ కార్డు, అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. పాత్రికేయులు కూడా సీఎంను మనస్ఫూర్తిగా ఆరాధించాలని, సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయన్న వ్యాఖ్యలను చూస్తే జర్నలిస్టుల సమస్యల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. జగన్‌ను ఆరాధించకుండా, ఆయన గురించి ఆరా తీస్తున్నారని, అది మానుకొని ఆరాధించాలని, సీఎంను ఆరాధిస్తే పాత్రికేయులకు తప్పనిసరిగా ఇళ్ల స్థలాలు వస్తాయని అనడం వారిని అవమానించడమేనని.. తక్షణమే జర్నలిస్టులకు మంత్రి వేణుగోపాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.