విరాటపర్వం సినిమాపై క్లారిటీ ఇచ్చిన రానా

లాక్ డౌన్ తో చాలా సినిమాలు ఓటీటీ బాట పడుతున్నాయి. నిశ్శబ్దం, ఒరేయ్ బుజ్జిగా, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాను కూడా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తారనే ప్రచారం ఉపందుకుంది. దీనిపై కొత్త పెళ్లి కొడుకు రానా స్పందించాడు.

తన సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వదని స్పష్టంచేశాడు రానా. విరాటపర్వం షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉందని, త్వరలోనే పెండింగ్ పార్ట్ పూర్తిచేసి, పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేస్తామని ప్రకటించాడు. అప్పటికి కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడతాయని, థియేటర్లలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తంచేశాడు రానా.