పేద, బడుగు బలహీన వర్గాలకు రంగా చేసిన సేవలు స్ఫూర్తిదాయకం: గురాన అయ్యలు

విజయనగరం, వంగవీటి మోహన్‌ రంగా 35వ వర్ధంతి వేడుకలు మంగళవారం స్థానిక జీఎస్ఆర్ కార్యాలయం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జనసేన నేత గురాన అయ్యలు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు రంగా చేసిన సేవలు అభినందనీయమని కొనియాడారు. వంగవీటి రంగా మరణించి 35 ఏళ్ళు గడిచినా ఆయనపై ప్రజలకు అభిమానం ఏ మాత్రం చెక్కుచెదరలేదని అన్నారు. పేదల కోసం జీవించి, వారితో మమేకమై బతికిన రంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారున్నారు. ఎమ్మెల్యేగా కొన్నాళ్లే పని చేసినా పేద ప్రజల సమస్యలపై ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగం చేసిన మహనీయుడు రంగా అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు ఏంటి రాజేష్, ఎమ్. పవన్ కుమార్, అడబాల వేంకటేష్ నాయుడు, పృథ్వీ భార్గవ్, బి.తేజ, కర్రోతు అప్పలనాయుడు, డి.హిమంత్, మధు తదితరులు పాల్గొన్నారు.