వాహనాల ద్వారా రేషన్ పంపిణీ గందరగోళం.. స్థానికుల ఆందోళన

ఇంటికే రేషన్ వస్తుందని సంబరపడినంత సేపు పట్టలేదు ఆ పద్ధతిలోని గజిబిజి, ఇబ్బంది అర్దం కావడానికి రేషన్ బండి వస్తుంది కదా అని పనులన్నీ మానుకుని ఉదయం నుంచీ ఇంటి వద్దే కూర్చుంటే.తీరా బండి వచ్చాకా, ఇప్పుడు సరుకు లేదు, రేపు వచ్చి ఇస్తామంటూ చెప్పడం రేషన్ కార్డుదారులకు ఇబ్బందిగా పరిణమించింది. ఇదేమని అడిగితే గొడవపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి వద్దకే రేషన్ పథకంపై స్థానికులలో అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. రేషన్ వాహనం పద్దతి గందరగోళంగా ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్ వాహనం కోసం పనులన్నీ మానుకుని ఎదురు చూస్తే.తీరా వాహనం వచ్చిన తరువాత సరుకు లేదు రేపు వస్తాం అంటూ వాహనం వెనుదిరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే ఇది నా బండి, రేషన్ ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండని దురుసు సమాధానం వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.