రౌతు వినయ్ ఆత్మహత్య – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • జనసేన నాయకులు గునుకుల కిషోర్

కోవూరు నియోజకవర్గం: బుచ్చిరెడ్డిపాళెం రౌతు వినయ్ ఆత్మహత్య చేసుకుని మూడు రోజుల గడుస్తున్నా పోలీసులు ఫిర్యాదు తీసుకుపోవడంతో జనసేన పార్టీ ఆత్మకూరు ఇన్చార్జినల్ శెట్టి శ్రీధర్ కెఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సుధా మాధవ్ మరియు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్ నందు రూరల్ డిఎస్పి వీరాంజనేయ రెడ్డి, బుచ్చి ఎస్సై ఎన్ మహేందర్ లను వివరణ కోరారు. సంఘటన ఈ రోజే మా దృష్టికి వచ్చిందని బాధితుల రిపోర్టు ఆధారంగా రీ పోస్టుమార్టం జరిపి ఆత్మహత్య బుచ్చిరెడ్డిపాలెంలో జరిగినప్పటికీ బాధితునిపై దాడి ఆత్మకూరులో జరిగింది. దాడికి గల కారణాలు కూడా ఫిర్యాదులు రిపోర్టులో పొందుపరచడం జరిగింది. దాని విధంగా విచారణ జరిపి వినయ్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. బాధితుల రిపోర్టు అనంతరం వినయ్ ఆత్మహత్య చేసుకున్న స్థలానికి పోలీసులు చేరుకుని చుట్టుపక్కల వారితో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. సాధారణ బైక్ మెకానిక్ పై అంత మంది దాడి చేయడం దారుణం కారణాలు ఏవైనా కూడా ఇద్దరినీ కలిసి ఎంతమంది విచక్షణ రహితంగా కొట్టడం మరియు అసభ్యకరజాల పదజాలంతో దూషించడం ఆమానవీయం. సీసీ ఫుటేజ్ మరియు బాధితుడు చనిపోతూ రాసిన లెటర్ల ఆధారంగా ఎలాగో పోలీసులు రీపోస్టు మార్టం చేస్తున్నారు కాబట్టి ఆత్మహత్యకు కారకులైన వారిని చట్టపరంగా శిక్ష పడేటట్టు చేయాలి. ఆ తల్లి కడుపు శోష నా బిడ్డ మరణానికి కారకులైన వారిని కటినంగా శిక్షించాలి, న్యాయం జరిపించాలి. సంఘటనలో దాడికి పాల్పడింది ముస్లింలు కాగా ఆత్మహత్య చేసుకున్న వినయ్ స్వామి మాల వేసుకున్న హిందూ.. ఈ దాడిని సున్నితమైన కోణంలో పరిశీలించి ఇది మతాల తగాదాకు దారి తీయకుండా భాదితుల తరఫున నిలబడి న్యాయవిచారణ జరిపించవలసిందిగా పోలీసులు కోరాము. దాడి మరియు అసభ్య పదాలతో దూషణ వల్లనే మనస్థాపానికి గురై చనిపోయారని చెబుతున్న కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకూ తోడుంటాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఆత్మకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ నళిశెట్టి శ్రీధర్, కేఎస్ఎస్ వర్కింగ్ ఇన్చార్జి సుధా మాధవ్, ప్రశాంత్ గౌడ్, షాజహాన్, మౌనిష్, కేశవ, వరా, సాయి, కాషిఫ్, షారు తదితరులు పాల్గొన్నారు.