యువశక్తి నిరుద్యోగ సంక్షేమ సంఘం పోస్టర్ ఆవిష్కరణ

విశాఖ పశ్చిమ నియోజకవర్గం: పారిశ్రామిక ప్రాంతం మల్కాపురం 61వ వార్డు పారిశ్రామిక ప్రాంతంలో పలు సేవా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్న వారు జన యువశక్తి నిరుద్యోగ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఆదివారం పోస్టర్ ఆవిష్కరణ మల్కాపురం మరిడిమాంబ అమ్మవారి గుడిలో నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన 61వ నాయకులు ములంపాక అప్పారావు, పశ్చిమ నియోజకవర్గం యువ నాయకులు ముప్పిన ధర్మేంద్ర అదే విధంగా శంకర్ యాదవ్, తులసి రామ్, నగేష్, భార్గవ్, ప్రేమ్ కుమార్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా మల్కాపురం హెచ్.పి.సిఎల్ లో స్థానికంగా ఉన్న యువకులకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలని, అదే విధంగా నైపుణ్యం ఉన్నవారికి నైపుణ్యం లేని యువతకు వెంటనే ఉపాధి కల్పించాలని స్థానికంగా ఉన్న వారికి కాలుష్యం ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించతం సరియైనది కాదని దీని పైన ప్రతి ఒక్కరినీ కాలుపుకువెళ్తు అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఎవరు అయితే ఈ విషవాయువుల వల్ల ఇబ్బంది పడుతున్నారో కంపెనీ పారిశ్రామిక ప్రాంతం లో ఉన్న ప్రజలకి, యువతకు ప్రధాన బాధ్యత ఇవ్వాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, దీనికి యాజమాన్యం వారు కూడా సహకరించాలని వారు కోరటం జరిగింది.