జాతీయ జెండాలను విద్యార్థులకు పంపిణీ చేసిన రవి కుమార్ మిడతాన

రవి ఎడ్యుకేషనల్ & చారిటబుల్ సొసైటీ ప్రెసిడెంట్ రవి కుమార్ మిడతాన ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం విజయనగరం సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీలో జాతీయ జెండాలను ప్రతి విద్యార్థికి పంచిపెట్టిన రవి కుమార్ మిడతాన.. యువతలో దాగున్న నిగూఢ శక్తిని వెలికితీయుటకు వివేకానందుడి రచనలు, ఆలోచనల దృక్పథం మరియు విలువలను అందరికీ తెలియజేయడం ఈ దినోత్సవ నిర్వహణ యొక్క ముఖ్య ఉద్దేశ్యం,1984 లో భారత ప్రభుత్వం జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించింది. 1985 నుంచి ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన స్వామీ వివేకానందుడు 1863 జనవరి 12 న జన్మించాడు. ఆయన జన్మదినం అయిన జనవరి 12 ను ప్రతీ సంవత్సరం జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటారు.
నేటి యువతే రేపటి భవిత అంటారు, యువతకు గల శక్తి అంతులేనిది, అపారమైనది, దేశ ఉన్నతికి, ఔన్నత్యానికి ఈ శక్తిని ఫణంగా పెడితే అన్నీతిరుగులేని విజయాలే ఉంటాయి. వారి విజయాలు వ్యక్తిగతం మాత్రమే కాదు, సామాజికమైనవి, తద్వారా జాతీయం, అంతర్జాతీయం అయినవి, ఈ శక్తి ఎప్పుడూ అనుకూల పధం సాగాల్సి ఉంది, యువ శక్తి దేశానికి ఎంత మేలు చేస్తుందో, గతి తప్పితే అంతకు రెట్టింపు కీడుచేస్తుంది. నేటి తరానికి బాధ్యతలు గుర్తు చేసేందుకు, యువతకు గల శక్తిని చాటి చెప్పేందుకు గాను అంతర్జాతీయ యువజనోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ కట్టమని, సీతం కాలేజ్ ప్రిన్సిపల్ శశిభూషణ్, సెటవిజ్ సీఈవో వి.విజయ్ కుమార్, యూనివర్సిటీ ఏవో డాక్టర్ సూర్యనారాయణ. స్పార్క్ ఎన్జీవో భవాని, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *