చేనేత కార్మికులకు అండగా నిలిచిన రాయలసీమ జనసేన

*సిల్క్ ధరలు పెరగడంతో అయోమయంలో నేత కార్మికుల బ్రతుకులు.. ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్యలు

సిల్క్ ధరలు పెరగడంతో అయోమయంలో వున్న నేత కార్మికుల బ్రతుకులు దుర్భరంగా మారే ప్రమాదం వుందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి, జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‌ఉపాధి కరువై, అప్పుల భాధ భరించలేక మనస్తాపంతో కుప్ప కూలిన కదిరి శేషాద్రి కుటుంబ సభ్యులను శనివారం గంగారపు రామదాస్ చౌదరి నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి రూ.10 వేలు ఆర్దిక సాయం అందించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ కరోనా నేపధ్యంలో చేనేత కార్మికుల స్థితిగతులు ఒక్కసారిగా దీన స్థితికి చేర్చిందని, ఈ పరిస్థితులలో ప్రభుత్వం స్పందించకుంటే ఆత్మహత్యలే శరణమని ఆవేదన వ్యక్తం చేశారు. సిల్కు ధరలను అదుపు చేసి మర మాగ్గాల కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత కొద్ది రోజులుగా చేనేత కార్మికులకు అవసరమైన ముడి సరుకు ధరలు పెరుగుతుండటంతో చేనేతరంగం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి పరిస్థితి దయనీయంగా మారిందని కార్మికుల ద్వారా తెలుస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోరవచూపి ముడి సరుకు ధరలు తగ్గేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ.. మదనపల్లె మండలంలో సుమారు 30 వేల మంది చేనేత వృత్తిపై అధారపడి జీవిస్తున్నారని తెలిపారు. పెరిగిన ముడి సరకు ధరలతో చేనేత కార్మికులైతే వీధిన పడిపోయారన్నారు. ప్రభుత్వం వెంటనే చేనేత కార్మికులను ఆదుకోవాలన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి అందుకోవడంతోపాటు బ్రాండ్ ఇమేజ్ కల్పిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా పార్లమెంటరీ సంయుక్త సమన్వయ కమిటీ సభ్యులు మైఫోర్స్ మహేష్, చేనేత విభాగం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సురేంద్ర, మూడవ వార్డు సహాదేవ, జనసేన పార్టీ పట్టణ ప్రదాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, రమేష్, రెడ్డిశేకర్ రెడ్డి, శివ, రామకృష్ణ, నాగరాజు, వీరాంజనేయులు, జయరాం తదితరులు పాల్గొన్నారు.