అంగన్వాడీల నిరసనకు రాయపూడి మద్దతు

అవనిగడ్డ: అంగన్వాడీలు న్యాయబద్ధమైన కోరికలను తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిష్కరించాలని, అంగన్వాడి టీచర్లు లేకుండానే వారి యొక్క అంగన్వాడి కేంద్రాలను వీఆర్వోలను, సచివాలయ ఉద్యోగులు పెట్టి బలవంతంగా తాళాలు పగలగొట్టడం చాలా దారుణమని రాయపూడి వేణుగోపాల్ పేర్కొన్నారు. శనివారం అవనిగడ్డలో ఐసిడిఎస్ కేంద్రం వద్ద అంగన్వాడి టీచర్లు వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసన దీక్ష ఐదో రోజు చేరుకోగా వారి దీక్షకు మద్దతుగా జనసేన కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్పంచ్ సంగం అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు మాట్లాడుతూ దొంగతనంగా అంగన్వాడి తాళాలు పగలగొట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 26,000 గౌరవ వేతనం అనేది న్యాయబద్ధమైన కోరికని ఆయన అన్నారు. అందరు ముఖ్యమంత్రులు వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అని అంతమంది ఎన్ని నిరసన దీక్షలు చేసిన ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన ఈ ముఖ్యమంత్రి పట్టించుకోడని ఆయన అన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉంటే మహా ఉంటే నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా ఉంటారని, తర్వాత వచ్చేది జనసేన, తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమని, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ యొక్క న్యాయమైన కోరికలన్నీ కూడా కూడా పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. అంగన్వాడి లు చేస్తున్న నిరసన దీక్షలను ఇప్పటికే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళమని ఆయన అన్నారు. ఎవరు కూడా అధైర్య పడకుండా పోరాటాలు కొనసాగించాలని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్లను, సచివాలయం ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటూ, అంగన్వాడి టీచర్లను సవితి పిల్లలాగా చూస్తున్నారని ఆయన అన్నారు. అంగన్వాడీలు ఈ విధంగా పోరాటాలు చేయడం చాలా సంతోషమని, మీరు చేస్తున్న పోరాటానికి జనసేన పార్టీ తరపున పూర్తిగా అండగా ఉంటామని తెలిపారు. ఐదు రోజుల నుండి అంగన్వాడీ టీచర్లు వారి యొక్క న్యాయబద్ధమైన కోరికలను పరిష్కరించాలని కోరుతుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా ఉండడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.