అభయాంజనేయస్వామి ఆలయానికి రాయపురెడ్డి 25,000 విరాళం

మాడుగుల: మాడుగు నియోజకవర్గం, చీడికాడ మండలంలోని బయలుపూడి గ్రామంలో గురువారం శ్రీశ్రీశ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం సందర్భంగా ముఖ్య అతిథులుగా మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ గారిని గ్రామ ఆలయ కమిటీ సిబ్బంది ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని మన్నించి రాయపూడి కృష్ణ బయలుపూడి గ్రామానికి విచ్చేసి ఉత్తర ప్రతిష్ట జరుగుతున్న అభయాంజనేయ స్వామి గుడికి మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున 25వేల రూపాయలను విరాళంగా గ్రామ సర్పంచ్ మరియు బయలుపూడి జనసేన నాయకులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కె.కోటపాడు మండల జనసేన నాయకులు, జనసైనికులు, బయలుపూడి గ్రామ ప్రజలు మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.