నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలసిన రాయపురెడ్డి

మచిలీపట్నం: జనసేన టిడిపి పొత్తు నిర్ణయించిన తర్వాత తొలిసారిగా జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ మచిలీపట్నంలో కలిసి మాడుగుల నియోజకవర్గం యొక్క సమస్యలను గురించి తెలియజేసి. మాడుగుల నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాలు గురించి టిడిపి క్యాడర్ తో సమన్వయం పరుచుకునే విధానం గురించి చర్చించి. మాడుగుల నియోజకవర్గంలో అన్ని విధాల కమిటీలను పూర్తి చేయవలసిందిగా మనోహర్ ని రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ ద్వారా కోరడమైందని రాయపురెడ్డి కృష్ణ తెలియజేశారు.