జనసేన కార్యకర్తలకు చిరు సత్కారము

  • జనసేన పార్టీ కోసం కష్ట పడ్డ ప్రతి కార్యకర్తకి సన్మానం చేసిన అఖిల కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం

కర్ణాటక: కర్నాటకలో ఉంటూ పవన్ కళ్యాణ్ పైన అభిమానంతో జనసేన పార్టీ కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్త కి కర్నాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సేవా సంఘం వారు చిరు సత్కారము చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మురళి గౌడ మాట్లాడుతూ మరో 6 నెలలలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తమ వంతు పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని తీర్మానని ప్రవేశ పెట్టారు. అక్కడకి వచ్చిన సంఘం నాయకులు కార్యకర్తలు తీర్మానాన్ని ఏకగ్రీవం ఆమోదం తెలిపారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడటం తమ లక్ష్యం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మంజు నాథ్ కిరణ్, ఆరాధన సవరం, పవన్ కుమార్ రాయల్, శివ, రాజు, కృష్ణ, వంశీ, గోవర్ధన్, గజేంద్ర నాయక్, హరీష్, బుజ్జి, సురేష్, సంతోష్, మురళి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.