కృష్ణం పాలెం యువతకు క్రికెట్ కిట్ అందజేసిన రాయపురెడ్డి

మాడుగుల నియోజకవర్గం: మాడుగుల మండలం, కృష్ణం పాలెం పంచాయతీకి చెందిన యువతకు మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రాయిపురెడ్డి కృష్ణ క్రికెట్ కిట్ ను అందజేశారు. గతంలో ఇక్కడను యువతకు వాలీబాల్ కిట్ స్పాన్సర్ చేసిన సమయంలో క్రికెట్ కిట్ ను యువత కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బుధవారం క్రికెట్ కిట్ ను తీసుకెళ్లి జనసేన నాయకులు రాజారెడ్డి మరియు మహేష్ చేతుల మీదుగా కిట్ ను గ్రామ యువతకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ఒక యువకుడిగా సాటి యువకులకు క్రీడా పరికరాలు ఇవ్వడంలో తనకు చాలా ఆనందంగా అనిపిస్తుందని, అందుకే ఏ పంచాయతీలో కిట్స్ అడిగినా సరే తగిన సమయంలో వెంటనే వారికి కిట్స్ అందజేయడంలో ముందుంటున్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణం పాలెం పంచాయతీ జనసైనికులు పాల్గొన్నారు.