వడ్డీ రేట్ల పై ఆర్బీఐ కీలక నిర్ణయం

ఆర్‌బీఐ మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడం వైపే మొగ్గుచూపింది. దీంతో రెపోరేటు 4 శాతంగా.. రివర్స్‌ రెపోరేటు 3.3 శాతంగా కొనసాగనున్నాయి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ద్రవ్యోల్బణ తగ్గుముఖం పడుతున్న సంకేతాలు ఉన్నప్పటికీ.. ఆర్‌బీఐ మరోసారి సర్దుబాటు వైఖరి వైపే మొగ్గుచూపింది. అక్టోబరు 6న ప్రారంభమైన ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయాలను శుక్రవారం గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు.