మంత్రి జోగి రమేష్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డ రెడ్డి అప్పల నాయుడు..

ఏలూరు: హౌసింగ్ మంత్రి జోగి రమేష్ పై ఏలూరు జనసేన ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ నిన్న ఒక పనికిమాలిన హౌసింగ్ మంత్రి ఏలూరు రావడం జరిగింది.. గత నాలుగు సంవత్సరాలుగా వారు ప్రజలకు ఇస్తామన్నా ఇల్లు నిర్మాణం ఎంతవరకు పూర్తి అయ్యాయో తెలుసు కోవడానికి వేలవేల పోతున్న హౌసింగ్ కాలనీ పరిశీలించడానికి హౌసింగ్ మినిస్టర్ జోగి రమేష్ రావడం జరిగింది.. అలా ఉండగా దాంట్లో కొన్ని పనికిమాలిన మాటలు పనికిమాలిన వాగుడు వాగడం తప్ప వారు చేసింది ఏమీ లేదు.. మీరు వచ్చి నాలుగు సంవత్సరాలు అయినా కూడా టిక్కో ఇల్లు పూర్తయిపోయినా పేద ప్రజలకు ఇవ్వకుండా వారిని మోసం చేసి వారివద్ద లక్షలాది రూపాయలు మున్సిపల్ కమిషనర్కి డిడిలు తీసిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా వారికి అవి అందించకుండా ఇప్పుడు ఏదో అట్టహాసంగా జగనన్న కాలనీలో తిరిగి ప్రజలను మభ్యపెట్టడానికి నిన్న ఒక ట్రాన్స్ఫార్మర్ ఓపెనింగ్ కి వచ్చి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై అవాకులు చవాకులు పేలడం సరైన విధానం కాదని చెప్పి, ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణకి మాకు అని చెప్పి గత 2019 ఎలక్షన్ లో ఫ్రెండ్లీ మ్యాచ్ అని చెప్పేసి వేలకోట్ల రూపాయలు కేసీఆర్ దగ్గర దండుకొని ఆరోజు గెలిచినటువంటి పరిస్థితి చూసాం.. పనికిమాలిన మంత్రులకి పనికిమాలిన ఎమ్మెల్యేలకు అడ్రస్ లు కావాలి గాని ఆధార్ కార్డులు అవసరం లేదా??.. భారతదేశంలో ఒక చరిష్మా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఆధార్ కార్డు అడ్రస్ అనేది అవసరం లేదననే ఇంగిత జ్ఞానం ఈ పనికిమాలిన మంత్రికి తెలియకపోవడం గమనార్హం. నిన్న ఆయన వచ్చినా పని ఏంటో కూడా ఆయనకి తెలియదు.. ఈ నాలుగు సంవత్సరాలు ఏ మంత్రి ఏ పని చెయ్యాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు.. హౌసింగ్ లోన్లు వచ్చినటువంటి వారి యొక్క పరిస్థితి ని వసంత కృష్ణ ప్రసాద్ అడిగితే మీరు ఎంత పని వాడో అనేది అక్కడ తెలుస్తుంది.. ఇదివరకు మా ఆంధ్రప్రదేశ్ రండి మా సచివాలయాలు చూడండి.. మా రైతు భరోసా కేంద్రాలు చూడండి అని చెప్పి రైతు భరోసా కేంద్రాలు, మరియు ఆరోగ్య కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు.. సచివాలయాలు చూస్తే ఈరోజు పంచాయతీలు మున్సిపల్ కార్యాలయాలు నిర్వీర్యం చేసి కేవలం సచివాలయాలని ప్రేకలాపాలుగా నిలిపిన చరిత్ర ఈ క్రిమినల్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది.. మరి ఏలూరులో చూస్తే ఇక్కడ దాదాపుగా 6000 మంది దగ్గర డబ్బులు కట్టించుకొని ఎక్కువ నగదు కట్టించుకునే 50,000 60,000 లక్ష రూపాయలు పేరుతో డిడి తీయించుకొని ఎమ్మెల్యేలు మంత్రులు ఏం ఉద్ధరిద్దాం అని ప్రజల దగ్గరికి వెళ్తున్నారు.. పవన్ కళ్యాణ్ గారిపై సినిమా గ్యాప్ లో వీసా తీసుకొని విజిట్ చేయడానికి వస్తాడని అని చెప్పి రాబోయే ఎలక్షన్లలో ఎవరు వీసా తీసుకుంటారో..?, ఎవరికి అడ్రస్ గల్లంతు అవుతుందో? ఎంతమందిని రాష్ట్ర ప్రజలు ఇంటికి పంపిస్తారో? ఎంతమంది జైలు పోతారో..? అనే విషయం మీ అందరికి తెలుసు కదా ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లారు.. మీ నాయకులు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా మీ ముఖ్యమంత్రి కూడా 16 నెలలు జైల్లో చిప్ప కూడు తిని వచ్చాడు.. మీరందరూ కూడా అదే బాపతికి చెందినవారు.. ఎటువంటి అవినీతి మచ్చ లేనటువంటి పవన్ కళ్యాణ్ గారు నీలాంటి పోరంబోకులకు భయపడే వ్యక్తి కాదు..ఈరోజు ఏలూరులో ఉన్నటువంటి శాసనసభ్యుడు ఈ నాలుగు సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారో మాకు తెలియదు గానీ కనీసం ఇక్కడ కట్టినటువంటి టిట్కో ఇల్లు ఇప్పించలేనటువంటి ఇలాంటి అసమర్ధ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నటువంటి ప్రజల బాధపడుతున్నారు.. ఈరోజు 26వేల ఇల్లు ఇచ్చారని ఏలూరు నియోజకవర్గంలో చూసుకుంటే 35 వేల రూపాయలు బలవంతంగా మహిళ ఖాతాల్లోనుంచి లాగి లక్ష 80 వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్నటువంటి నిధులతో కనీసం పూర్తిస్థాయి ఇల్లను నిర్మాణం చేయలేకపోయారు.. కేవలం బేస్మెంట్లు వేసి పరిమితం చేసారు.. 2600 బేస్మెంట్ కూడా లేనటువంటి ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యేలు ఢిల్లీలో బిజెపి కాలు పట్టుకుంటారు.. నిన్నే మీ సీ.ఎస్ మీటింగ్ పెట్టి చెప్పింది విద్యా జీవన డబ్బులు ఇవ్వడానికి నిధులు లేక ఆర్థిక శాఖ విలవిలాడుతా ఉంది.. దానికోసమే వాయిదా వేసాము.. అని అదేవిధంగా మార్చి నెలలో ఎంప్లాయిస్ యొక్క జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం వద్ద ఖజానా లేదు. అందుకని ఎప్పుడు ఇస్తామో చెప్పలేము. కానీ మా ముఖ్యమంత్రి గారు కూడా లండన్ కి వెళ్లాల్సిన కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకుని ఢిల్లీకి వెళ్లారు. అవినాష్ రెడ్డి కేసులు కోసం ఢిల్లీ వెళ్తున్నారు.. ఇటువంటి పనికిమాలిన పనులు మానేసి ప్రజ ధనంతో మీరు కులుకుతున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు గానీ ప్రజలకు ఏం చేయాలి..? ఈరోజు జగనన్నే మా భవిష్యత్తు.. జగనన్నయ్యే మాకు దిక్కు స్టిక్కర్లు అంటించుకున్నటువంటి మీ దిక్కుమాలిన ప్రభుత్వం.. మీ దిక్కుమాలిన నిర్ణయాలు.. మీ పనికిమాలిన ఆలోచనలు.. ఈ ఐదున్నర కోట్ల మంది ప్రజల జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. అయినా మీకు ఇంకా బుద్ధి లేకుండా జనాల్లో ఏదో ఘనకార్యం చేసినట్లు సన్మానాలు చేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళనాని చెబుతున్నాడు ఏంటంటే డిసెంబర్ నెలలో కలుస్తాడట.. డిసెంబర్ నెలలో అన్ని ఇచ్చేస్తాడట.. అయ్యా ఆళ్ల నాని గారూ ఇప్పటివరకు మీరు చేసింది ఏమీ లేదు.. మీరు కట్టిస్తున్న ఆ టిక్కో ఇల్లు శిధిలావస్థకు చేరుతున్నాయని రెడ్డి అప్పలనాయుడు వైసీపీ ప్రభుత్వం పై విధంగా ఘాటుగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, అధికారి ప్రతినిధి అల్లు సాయి చరణ్, నాయకులు వీరంకి పండు, బొండా రాము నాయుడు, పసుపులేటి దినేష్ తదితరులు పాల్గొన్నారు.