శ్రీరామపూజా అక్షతల కలశముల ఊరేగింపులో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు: అయోధ్య నుండి ఏలూరుకు చేరుకున్న శ్రీరామపూజా అక్షతల పవిత్ర కలశములు ఊరేగింపులో పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. అయోధ్య పుణ్య క్షేత్రం నుంచి శ్రీరామ పూజా అక్షతల పవిత్ర కలశాలు గురువారం ఏలూరుకు చేరుకున్న శుభ సందర్భంలో ఏలూరు టి.టి.డి.కళ్యాణ మండపం వద్ద శ్రీరామ నామ సంకీర్తనతో అక్షతల పవిత్ర కలశాలకు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో శ్రీ రామనామ సంకీర్తనంతో బయలుదేరి ఫైర్ స్టేషన్ సెంటర్ మీదుగా దొండపాడు దత్తాశ్రమం వరకు ఊరేగింపు నిర్వహించారు. అయోధ్య అక్షతల కలశాలను ఆలయం వద్ద భద్రపరిచారు. ఈ సందర్భంగా వి. హెచ్.పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తనికెళ్ళ సత్య కుమార్ మాట్లాడుతూ 500 సంవత్సరాల నుండి చూస్తున్న శుభ ఘడియలు రాబోతున్నాయని, అయోధ్యలో జనవరి 22వ తేదీన నవ్య, దివ్య, భవ్య రామ మందిర నిర్మాణానికి ముహూర్తం నిర్ణయించడంతో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీరాముని వారికి అభిషేకించిన అక్షతలు అన్ని రాష్ట్రాలకు అందించడం జరిగిందని అన్నారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ.. నవంబర్ 22వ తేదీన జిల్లాలోని అన్ని మండలాలకు 25వ తేదీన అన్ని పంచాయతీలకు అక్షతల పవిత్ర కలశాలకు చేరే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జనవరి ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి కుటుంబానికి పవిత్ర అక్షంతలు, శ్రీరామ మందిర నిర్మాణ నమూనా, విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రికను కూడా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర కార్యదర్శి కందుకూరి ఈశ్వర్ రావు, వి. హెచ్.పి జిల్లా కార్యదర్శి గడ్డం నాగరాజు, బిజెపి జిల్లా అధ్యక్షులు చౌటపల్లి విక్రమ్ కిషోర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నడపన భాస్కర్, దెందులూరు నియోజకవర్గం బిజెపి కన్వీనర్ గుమ్మడి చైతన్య పెద్ద సంఖ్యలో విశ్వహిందూ పరిషత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.