వలస కార్మికుల కొరకు అంత్యోదయ ట్రైన్లు వేయాలి- గవర సోమశేఖర్ రావు

గాజువాక: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వందే భారత్ ట్రైన్లు నడపడం సంతోషకరమని అయితే మన దేశపురోగతికి వెన్నుముక అయిన వలస కార్మికులు జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి దేశంలో ఉన్న ప్రముఖ పట్టణాల్లో ముఖ్యంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబాయి, గుజరాత్, కేరళలలో పని చేయడానికి రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఈ మధ్యకాలంలో రైల్వే శాఖ ఏసీ బోగీలు పెంచి స్లీపర్ క్లాస్ భోగీలు తగ్గించడం వల్ల వలస వెళ్లే కార్మికులు టిక్కెట్ తీసుకున్నప్పటికీ రైల్వే జనరల్ బోగీలలో ఖాళీ లేక పోవడం వలన గత్యంతరం లేని స్థితిలో స్లీపర్ క్లాస్ బోగీలు ఎక్కుతున్నారు. దీనివల్ల స్లీపర్ లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. రైల్వే అధికారులు వీళ్ళను అనధికార ప్రయాణికులుగా గుర్తించి అపరాధరసం వసూలు చేసి మధ్యలో నే దింపేస్తున్నారు దీని వల్ల వాళ్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, దోపిడి మరియు అవమానాలకు గురవుతున్నారు. కావున రాబోవు 2023-24 కేంద్ర బడ్జెట్లో వలస కార్మికులు ప్రయాణిస్తున్న రూట్లలో వలస కార్మికుల కోసం దూర ప్రాంతాలకు అంత్యోదయ (అన్ని జనరల్ బోగీలు) ట్రైన్లు వేసి వాళ్లు ఆత్మగౌరవంతో ప్రయాణం చేసేటట్టు ఏర్పాట్లు చేయాలని గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 85 వార్డు ఇంచార్జ్ గవర సోమశేఖర రావు ప్రధానమంత్రి కి ఆన్లైన్ గ్రీవియన్స్ నెంబర్ పి.ఎమ్.ఓ.పి.జి/ఈ/2023/0019475 ద్వారా విన్నవించారు. అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మరియు రైల్వే బోర్డు చైర్మన్ అనిల్ కుమార్ లాహోటికి ఇ-మెయిల్ ద్వారా విన్నవించారు.