కొమడవోలు గ్రామంలో జగనన్న కాలనీ సందర్శించిన రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్ ల ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు జగనన్న కాలనీల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కొమడవోలు పంచాయతీలో ఏలూరు నియోజవర్గంలో ఉన్న పేద ప్రజలకు ఇళ్లను ఇవ్వడానికి ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షానికి చెరువులు తలపించే విధంగా ఉన్నాయి. కనీసం ఈ కాలనీలో నాణ్యమైన రోడ్లు కూడా వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని, పైగా 20 లక్షల మంది పేద ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుస్తామని మాయమాటలు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు కాలనీలో పరిస్థితి చూస్తుంటే అధోగమనంగా ఉందని కనీసం ఈ కాలనీలు అభివృద్ధి చెందాలంటే 30 సంవత్సరాలు పడుతుందని వ్యాఖ్యానించారు. కేవలం బేస్మెంట్లతో పనులు ప్రారంభించి గృహాలను నిర్మాణం చేయకుండా కాలయాపన చేస్తున్నారని, బడా కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పజెప్పి నాసిరకం నిర్మాణాలు చేస్తున్నారని, రాబోయే రోజుల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని మరో ఆరు నెలల పాటు మీ ప్రభుత్వం కొనసాగుతుంది. తదుపరి జనసేన ప్రభుత్వం వచ్చి ఈ కాలనీల నిర్మాణాల పనులు పూర్తి చేసి ప్రజలకు గృహప్రవేశం చేసుకునే విధంగా తయారుచేసి రవాణా సౌకర్యాలకు గాని నిర్వాసితులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జనసేన పార్టీ చూస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశి నరేష్, జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్వి, నగర ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణ్ కుమార్, సురేష్, నాయకులు వీరంకి పండు, గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, తేజ ప్రవీణ్, అల్లు సాయి చరణ్, పైడి లక్ష్మణరావు, కురెళ్ళ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.