3 చలివేంద్రాలను ప్రారంభించిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు నియోజకవర్గంలోని పెద్ద రైల్వే స్టేషన్ గూడ్ షెడ్డు రోడ్డులో 2, 3వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 39 వ డివిజన్ సుబ్బమ్మ దేవి స్కూల్ సెంటర్ లో బొత్స మధు ఆధ్వర్యంలో 19 వ డివిజన్ మినీ బైపాస్ రోడ్డులో వీరంకి పండు ఆధ్వర్యంలో రెడ్డి అప్పలనాయుడు చేతుల మీదుగా చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన రెడ్డి అప్పల నాయుడుకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వేసవి తాపానికి బాటసారులు, వాహనదారుల దాహార్తి తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ చలివేంద్రం ఎంతో మందికి దప్పిక తీరుస్తుందని, చలివేంద్రాన్ని ఏర్పాటు కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. డొక్కా సీతమ్మ పేరు మీద ఈ చలివేంద్రం పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు దాహం తీర్చడం కోసమే ఏర్పాటు చేస్తున్నామని అలాగే ఈ ఎండాకాలం అంత ఉంటుందని ఈవిధంగా తెలియజేశారు. రేపు ఎల్లుండి కూడా అనేక డివిజన్ లో ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, కార్యదర్శి కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, నిమ్మల శ్రీనివాసరావు బోండా రాము నాయుడు, పసుపులేటి దినేష్, రెడ్డి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.