పవన్ కళ్యాణ్ పై రెక్కీ ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలి

• తాడేపల్లి ప్యాలెస్ కుట్రే పవన్ కళ్యాణ్ పై రెక్కీ
• సీఎం జగన్ ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారు
• ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అందుకే మోకాళ్లపై నిరసన
• పవన్ కళ్యాణ్ కి జెడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పించాలి.

విజయవాడ, పవన్ కళ్యాణ్ పై రెక్కి ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తూ విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ కూడలి వద్ద జనసేన పార్టీ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేష్ ఆధ్వర్యంలో మోకాళ్ళపై జనసేన నేతలు, వీర మహిళలు, కార్యకర్తలు, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ హైద్రాబాద్ లో పవన్ ఇంటి ముందు రెక్కీ నిర్వహించడమంటే పవన్ కళ్యాణ్ పై దాడి చెయ్యడమేనని, జగన్ హత్యారాజకీయాలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కీకి తాడేపల్లి ప్యాలెస్ లో కుట్రపన్నారని, ఏపి ప్రభుత్వ వాహనాలు దొరికినా జగన్ కాని ప్రభుత్వం కాని స్పందించలేదంటే జగన్ కుట్రే అని, కుట్ర రాజకీయాలు జగన్ కి వెన్నతో పెట్టిన విద్య అని, కుర్చీ కోసం కుటుంబ సభ్యుల్ని మర్డర్ చేయించిన నైజం జగన్ మోహన్ రెడ్డిదని, జగన్ వి అన్నీ 420 తెలివితేటలని, పవన్ కళ్యాణ్ చిన్న గీత పడినా వైఎస్ఆర్సిపి తలరాతలు మారిపోతాయని, వైఎస్ఆర్సిపి నేతల తలలు తెగుతాయని, ఏపీ నుంచి వైఎస్ఆర్సిపి నాయకులను తరిమి కొడతామని, శ్రీలంక రాజపక్స్ కు పట్టిన గతే జగన్ కి పడుతుందని, విశాఖపై ఎవరు స్పందించిన తాడేపల్లి ప్యాలెస్ లో భూకంపాలు వస్తున్నాయని, అసలు విశాఖలో ఏమైందని జగన్ గారు ఏం జరుగుతుందని విధ్వంసం సృష్టిస్తున్నారని, ఋషికొండపై విచారణ కమిటీ వస్తుందని భయంతోనా అని ? సీఎం జగన్ అవినీతి అనకొండ ముందు లక్ష అవినీతి అనకొండలు కూడా సరిపోవని, ఏపిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తితే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని, అయ్యన్న పాత్రుడుని అక్రమ అరెస్ట్ చేశారు కాని కోర్టు బెయిల్ ఇచ్చిందని, ఏపిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ఉమ్మడి ఉద్యమాలు చేయాలని, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వైఎస్ఆర్సిపి విముక్తి ఆంధ్రప్రదేశ్ కావాలంటే ప్రజలంతా కలసి రావాలని, విశాఖ, హైద్రాబాద్ ఘటనపై డిజిపి ఎందుకు స్పందించడం లేదో సమాధానం చెప్పాలని, పవన్ కళ్యాణ్ కి జడ్ కేటగిరి బధ్రత కల్పించాలని కేంద్రాన్ని కోరుతున్నామని, పవన్ కళ్యాణ్ భధ్రతపై బిజెపి నేతలు సునీల్ దేవధర్, సోమూవీర్రాజు కేంద్రాన్ని కోరాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు శిగీనంశెట్టి రాము గుప్తా, నల్లబెల్లి కనకారావు, తమ్మిన లీలా కరుణాకర్, జేల్లి రమేష్, మల్లెపు విజయలక్ష్మి, బత్తుల వెంకటేష్, కూరాకుల సురేష్, వేంపల్లి గౌరీ శంకర్, తిరపతి సురేష్, ఏలూరు సాయి శరత్, పోట్నురి శ్రీనివాసరావు, సోమీ గోవింద్, రెడ్డిపల్లి గంగాధర్, ఆకుల రవి కిరణ్, బొమ్మ రాంబాబు, సెంట్రల్ నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి వంశీకృష్ణ, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్, నగర ఉపాధ్యక్షులు వెన్నా శివశంకర్, కృష్ణ పెన్న మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య, బొబ్బూరి కొండలరావు, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, బొట్ట సాయికుమార్, పులిచేరి రమేష్, తొత్తడి భరత్, అలియా బేగం, విజయ్ కుమారి, రజిని తదితరులు పాల్గొన్నారు.