చేబ్రోలు, కొడవలి గ్రామాలలో పలువురికి సహాయం అందించిన జ్యోతుల

పిఠాపురం నియోజవర్గం: గొల్లప్రోలు మండలం, చేబ్రోలు గ్రామానికి చెందిన తంగెళ్ల సత్యవతి అకాలంగా మరణించారు. సత్యవతి కుటుంబం చాలా బీదకుటుంబం. తంగెళ్ల సత్యవతి కుటుంబం ఆర్దికస్దితిని చేబ్రోలు గ్రామానికి చెందిన ఆకుల శ్రీను పోన్ ద్వారా సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసుకి తెలియజేయగా వెంటనే స్పందించి శనివారం జ్యోతుల శ్రీనివాసు చేబ్రోలు గ్రామంలో గల తంగెళ్ల సత్యవతి నివాసానికి వెళ్లి తంగెళ్ల సత్యవతి కుమారులు తంగెళ్ళ నాగు, తంగెళ్ళ బాబ్జిలను పరామర్శ చేసి తంగెళ్ల సత్యవతి మరణానికి గల కారణంను అడిగి తెలుసుకొని సత్యవతి మరణం పట్ల నివాళిని అర్పించారు. అనంతరం తంగెళ్ల సత్యవతి మరణాంతర కార్యక్రమాలు నిమిత్తం 25 కె జిల బియ్యం, కిరాణసామానులు, 3000 నగదును కుటుంబసభ్యులకు సహయంగా అందించారు. అనంతరం చేబ్రోలు గ్రామంలో బోచ్చ బాబురావు మరణించారు. సదరు విషయం సాయిప్రియ సేవాసమితి వాలంటీర్ ద్వారా తెలుసుకొని బోచ్చ బాబురావు నివాసానికి వెళ్లి బోచ్చ బాబురావు భార్య, కుమారులు
బోచ్చా సత్యవతి, బోచ్చా లొవరాజు, బోచ్చా మణికంఠలను పరామర్శ చేసి బోచ్చ బాబురావు మరణానికి గల కారణంను అడిగి తెలుసుకొని బోచ్చ బాబురావు మరణం పట్ల నివాళిని అర్పించారు. అనంతరం బోచ్చ బాబురావు మరణాంతర కార్యక్రమాలు నిమిత్తం 25 కె జిల బియ్యం కిరాణసామానులు, 3000 నగదును కుటుంబసభ్యులకు సహయంగా అందించారు. ఈ సందర్భంగా సాయిప్రియ సేవాసమితి వ్యవస్దస్దాపకాధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు మాట్లాడు నిరుపేదలు కష్టసమయంలో నాకు తెలిస్తే వారికి నాకు తగిన సహయసకారం అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాలలో ఆకుల శ్రీను, గంటా గోపి, అల్లం దొరబాబు, యాదాల ముత్తారావు, బుద్దాల శ్రీనివాస్, దేవినీడి దుర్గ, తంగెళ్ల రాము, ఆకుల నాగబాబు, నాగం అప్పారావు, అల్లం దొరబాబు, కాకి సూరిబాబు, తోట శ్రీను, దిబ్బిడి సురేష్, బుద్ధాల శ్రీను పేకేటి వెంకటరమణ, మేడిబోయిన హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో గత కొంతకాలం నుండి పక్షవాతం, ఇతర దీర్ఘకాలికవ్యాధులతో బాధపడుతూ వృద్ధాప్యంలో ఉండి గత కొంతకాలంగా మంచంపైన ఉండి వైద్యం పోందుతున్న బీదకుటుంబాలైన పాలిక కామరాజు మరియు హరిజనపేట కాలనీ, వీరవల్లి చంటి తండ్రి గంగయ్య గూర్చి సాయిప్రియ సేవాసమితి వాలంటీర్లు ద్వారా పైన పేర్కొన్న వారి ఆరోగ్యం, ఆర్దికపరిస్దితుల గూర్చి విషయం తెలుసుకొన్న జ్యోతుల శ్రీనివాసు శనివారం సమయానికి జ్యోతుల శ్రీనివాసు కొడవలి గ్రామంలో గల పాలిక కామరాజు, వీరవల్లి చంటి నివాసగృహాలకు వెళ్లి వారి ఆరోగ్యం గూర్చి వారి కుటుంబసభ్యులను వాకబు చేసి వారికి తగిన ఆరోగ్యం చేకూర్చాలని భగవంతుని కోరారు. అనంతరం ఇరువురికి కొడవలి పెద్దల సమక్షంలో వైద్యసహాయం నిమిత్తం నగదు 3000/-కుటుంబ కనీసఅవసరాల నిమిత్తం 25 కె జిల బియ్యం, కిరాణసామానులు, దుప్పటిని వారికి, వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడవలి గ్రామానికి చెందిన వీరవల్లి లక్ష్మి, రెడ్నం సూరిబాబు, కొయ్యా అప్పారావు, నక్కా నారాయణమూర్తి, నరాల సుబ్రహ్మణ్యం, నేమాల నాగేశ్వరరావు,తూము పూసలు, మచ్చా శ్రీను,పాలిక కామరాజు, పాలికరామస్వామి, పాలిక రవికుమార్, పాలిక రాజు, పాలిక అశోక్ కుమార్, రెడ్నం వెంకటేశ్వరరావు, యాదల రామకృష్ణ, నక్కా కృష్ణ, యాదల శ్రీను, గంటా గోపి, పేకేటి వెంకట రమణ మేడిబోయిన హరికృష్ణ తదితరులు‌ పాల్గొన్నారు.