6 రోజులుగా కొనసాగుతున్న అవనిగడ్డ జనసైనికుల రిలే నిరాహారదీక్ష

అవనిగడ్డ – కోడూరు ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతూ అవనిగడ్డ నియోజక వర్గ జన సైనికులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలో బాగంగా 6వ రోజు ఘంటసాల మండల జనసేన పార్టీ అధ్యక్షులు కోన రాజశేఖర్, మండల జనసైనికులు పాల్గొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అవనిగడ్డకు వచ్చి రోడ్డు నిర్మాణానికి 35 కోట్లు మంజూరు చేస్తున్నానని చెప్పి, 5 నెలలు దాటి, 6 నెలలు కావస్తున్నా నేటికీ నిధులు మంజూరు కాకపోవడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందని, సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి కూడా దిక్కు లేదని, ఈ విషయంలో స్థానిక శాసన సభ్యులు పూర్తిగా విఫలం అయ్యారని నేతలు దుయ్యబట్టారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ నియోజక వర్గం కు వెళ్ళినా 100 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని కల్లిబొల్లి మాటలు చెప్తూ, ప్రజల చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. కరకట్ట మరమ్మతులు, డ్రైనేజ్ సిస్టమ్ మరమ్మతులు, డంపింగ్ యార్డ్ తరలింపు, ఎడ్లంక గ్రామానికి వంతెన లాంటి అనేక హామీలు ఇచ్చారని, ఒక్క పని కూడా ప్రారంభించక పోవడం చూస్తుంటే మాటల ముఖ్యమంత్రిగానే మిగిలి పోతారని, చేతల ముఖ్యమంత్రి కాదని నేతలు ఎద్దేవా చేశారు. గర్భిణీ స్త్రీలు, వృద్దులు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయలేక నరక యాతన అనుభవిస్తుంటే, ఇళ్ళ గోడల మీద స్టిక్కర్ లు వేయడానికి బడ్జెట్ లో కేటాయింపులు జరిపి, మౌళిక సదుపాయాల మీద దృష్టి పెట్టక పోవడంతో ఈ వైసీపీ ప్రభుత్వం పాలించే నైతిక హక్కు కోల్పోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ కార్యదర్శి లంకే యుగంధర్, యండకుదురు ఎంపీటీసీ సిద్దినేని కుమార్ రాజా, పూషడం గ్రామ సర్పంచ్ అంకం మారుతీరావు, యార్ల శ్రీకాంత్, పోతన ఆంజనేయులు, కొండవీటి శ్రీనివాస్, అవనిగడ్డ, కోడూరు మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మర్రి గంగయ్యలు, పిట్టల్లంక గ్రామ సర్పంచ్ కనగాల వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు బచ్చు వెంకట నాథ్, చన్నగిరి సత్యనారాయణ, బాదర్ల లోలాక్షుడు, ఉల్లి శేషగిరరావు, బడే వెంకటేశ్వరరావు, సనకా గోపాలరావు, చిట్టూరు గ్రామ ఉప సర్పంచ్ చింతల నాగబాబు, బొప్పన పృధ్వీ, వార్డు మెంబర్ కమ్మిలి సాయి భార్గవ, తుంగల నరేష్, సుగ్గున పవన్ కుమార్, కొండవీటి ఏడు కొండలు, కోట రాంబాబు, రేపల్లె రోహిత్, అప్పికట్ల శ్రీభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.