ఏపి అన్‌లాక్-4 మార్గదర్శకాలు విడుదల

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం అన్‌లాక్‌ 4 మార్గదర్శకాలను జారీ చేసింది. ఈనెల 21 నుంచి 9, 10వ తరగతి విద్యార్థులు స్కూళ్లకు వెళ్లవచ్చు. సెప్టెంబర్ 21 నుంచి కాలేజీలకు వెళ్లేందుకు ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు ఒప్పుకుంటున్నట్లు తల్లిదండ్రులు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21 నుంచి వంద మందికి మించకుండా. విద్యా, సామాజిక, స్పోర్ట్స్, మతపరమైన, రాజకీయ సమావేశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే. పెళ్లిళ్లకు 50 మంది దాకా అతిథులు హాజరు కావచ్చు. అలాగే అంత్యక్రియలకు 20 మందికి మించి ఉండకూడదు. అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్‌కు అనుమతినిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.