ఫ్యాన్స్‌కు గిఫ్ట్ గా ‘సర్కారు వారి పాట’ మోష‌న్ పోస్ట‌ర్‌ విడుద‌ల

‘స‌ర్కారు వారి పాట’ మోష‌న్ పోస్ట‌ర్‌ రిలీజ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున అభిమానులకు పెద్ద గిఫ్ట్ లభించింది. ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తున్న మహేష్ 27వ సినిమా ‘సర్కారు వారి పాట’ మోష‌న్ పోస్ట‌ర్‌ను మహేష్ 45 వ పుట్టినరోజు సందర్బంగా విడుద‌ల చేశారు. ఇక రిలీజ్ కాగానే మహేష్ మోషన్ పోస్టర్ కొత్త రికార్డులు సృష్టిస్తూ అభిమానులను అలరిస్తోంది.

ఈ మోషన్ పోస్టర్‌లో మహేష్ ఒక రూపాయి నాణెన్ని ఎగ‌ర‌వేస్తూ కనిపిస్తారు. అయితే ఇక్కడ మహేష్ కనబడరు.. అతని చేయి మాత్రమే కనిపిస్తోంది. స‌ర్కారు వారి పాట అంటూ.. హుక్ లైన్‌ బ్యాగ్రౌండ్‌లో చిన్న బీట్‌గా వ‌స్తుంది.

ఈ సర్కారు వారి పాట చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో నిర్మిస్తున్నాయి. మహేష్ బాబు సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది.